Header Banner

భూమి,ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారా? ఈ కొత్త రూల్స్ తెలియకపోతే నష్టం మీకే!

  Mon Feb 24, 2025 08:30        India

భారతదేశంలో భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేయడంలో రిజిస్ట్రేషన్ కీలకమైన చట్టపరమైన ప్రక్రియ. ఈ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా, సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం 2025 నుంచి కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చింది. 

 

భూమి రిజిస్ట్రేషన్ కొత్త మార్పులు: జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నియమాలు భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇకపై అన్ని డాక్యుమెంట్స్ ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఈ ప్రాసెస్ అంతా ఇంటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. డిజిటల్ సంతకాలు: రిజిస్ట్రేషన్ డిజిటల్ సంతకంతో పూర్తవుతుంది. తక్షణమే డిజిటల్ సర్టిఫికెట్: రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే డిజిటల్ ధృవీకరణ పత్రం లభిస్తుంది. అవినీతి, మోసాల నివారణ: నకిలీ రిజిస్ట్రేషన్లు, భూ వివాదాలను తగ్గించేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయి. 

 

ఆధార్ లింక్ తప్పనిసరి: కొత్త నియమాల ప్రకారం భూమి రిజిస్ట్రేషన్‌కు ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. దీని ద్వారా కలిగే ప్రయోజనాలు మోసపూరిత రిజిస్ట్రేషన్లు తగ్గుతాయి. ఆస్తి రికార్డుల సమగ్రత: ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా బినామీ ఆస్తులను గుర్తించడం సులభం అవుతుంది. వ్యక్తిగత భద్రత: ఆకస్మిక రిజిస్ట్రేషన్లు, అక్రమ మార్పిడులను నిరోధించవచ్చు. 

 

రిజిస్ట్రేషన్ వీడియో రికార్డింగ్: ఇకపై భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వీడియో రికార్డింగ్ తప్పనిసరి. పారదర్శకత పెరుగుతుంది. ఏమైనా వివాదాలు తలెత్తినప్పుడు సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. బలవంతపు రిజిస్ట్రేషన్లను అరికట్టే అవకాశం ఉంటుంది. 

 

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: అన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు, పన్నులను ఇకపై ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. నగదు లావాదేవీలు తగ్గుతాయి. ఫీజు చెల్లింపు ప్రక్రియ వేగవంతం అవుతుంది. అవినీతి అవకాశాలు తగ్గుతాయి. 

 

భూమి రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియ: కొన్ని రాష్ట్రాల్లో, రిజిస్ట్రేషన్ రద్దు కోసం 90 రోజుల గడువు ఉంటుంది. అలాగే అక్రమ రిజిస్ట్రేషన్. కుటుంబ సభ్యుల అభ్యంతరాలు. వాణిజ్య ప్రయోజనాలు ఉంటే భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ రద్ధు అయ్యే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాన్ని లేదా రిజిస్ట్రేషన్ విభాగాన్ని సంప్రదించాలి. గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్ కార్యాలయాన్ని సంప్రదించాలి. అభ్యంతర పత్రము, తాజా రిజిస్ట్రేషన్ పత్రాలు, గుర్తింపు రుజువులు సమర్పించాలి. 

 

భూమి రిజిస్ట్రేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్స్ : ఆస్తి యాజమాన్య పత్రం. కొనుగోలు & అమ్మకపు ఒప్పందం. ఆస్తి పన్ను చెల్లింపు రసీదులు. కొనుగోలుదారు & విక్రేత ఆధార్ కార్డులు. పాన్ కార్డ్, ఓటర్ ఐడీ / పాస్‌పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్. 

 

భూమి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ & ఫీజులు: స్టాంప్ డ్యూటీ రేట్లు: రూ. 20 లక్షల లోపు – 2% రూ. 21 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు – 3% రూ. 45 లక్షలకు పైబడి – 5% 

 

అదనపు ఛార్జీలు: సెస్: 10% (గ్రామీణ ప్రాంతాలకు మినహాయింపు) సర్‌చార్జ్: పట్టణాల్లో 2%, గ్రామీణ ప్రాంతాల్లో 3% (రూ. 35 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తులపై) రిజిస్ట్రేషన్ ఫీజు: ఆస్తి విలువ శాతంలో లెక్కించబడుతుంది. 

 

ఈ కొత్త మార్పులతో భూమి రిజిస్ట్రేషన్ మరింత వేగవంతం, సురక్షితం, పారదర్శకంగా మారనుంది. అవినీతిని అరికట్టడంతో పాటు భూ వివాదాలను తగ్గించేందుకు ఇది ఉపయోగపడనుంది. భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే వారు ఈ మార్పులను తప్పనిసరిగా తెలుసుకోవాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Business #Lands #Registration